![వై.ఎస్.కాంత్ Profile](https://pbs.twimg.com/profile_images/1700139757236318208/Qjg_ImF3_x96.jpg)
వై.ఎస్.కాంత్
@yskanth
Followers
49K
Following
90K
Statuses
53K
ప్రకృతి, పుస్తకాలు & ప్రేమలు! పవన్ కళ్యాణ్ & జనసేన పార్టీ! Permaculture & Real-estate projects! Amazon affiliated!
Vijayawada, India
Joined June 2014
From USA to INDIA ✈️ Blog (Part 2) Loading...
కడుపులో నీళ్లు కదలకుండా కెరీర్ సజావుగా సాగుతున్నప్పుడు, అర్ధాంతరంగా అమెరికా వదిలేసి ఇండియా వచ్చేయడం వల్ల ఏం కోల్పోయానో ఏం సంపాదించానో ఎప్పుడూ లెక్కలేసుకోలేదు గానీ... రాకపోతే మాత్రం జీవితాంతం చాలా బాధపడేవాడిని! అమెరికా వదిలేసి అసలెందుకు వచ్చేశాను??? 1) ఆ రోజుకున్నఅపరిపక్వత వల్లనో లేక సున్నిత మనస్తత్వం వల్లనో... తల్లిదండ్రులను వదిలేసి ఫ్యామిలీ లోని ఇద్దరు పిల్లలూ విదేశాల్లో సెటిల్ అవ్వడం ఎందుకో గిల్టీగా ఉండేది. వాళ్ళకేమన్నా కష్టం వస్తే అన్న ఆలోచన వెంటాడేది. సో, మూవ్ కావడానికి ప్రధాన కారణమిదే! 2) పవన్ కళ్యాణ్ ప్రభావం నా మీద ఎంతలా ఉండిందంటే... అప్పులు తీర్చగా మిగిలిన డబ్బుతో వెంటనే తక్కువలో ఒక పది ఎకరాల పంట భూమి కొనే అంత & లెక్కలేనన్ని తెలుగు పుస్తకాలు సేకరించే అంత. వెనక్కి వెళ్ళిపోయి ఫార్మ్ సెటప్ చేసి ప్రశాంతంగా ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో బ్రతకాలనేది రెండో కారణం! 3) ప్రేమలూ బ్రేకప్పులూ, పెళ్ళీ పిల్లలూ, వ్యాపారాలూ మోసాలు నష్టాలూ, ఇడ్లీ కూడా అరాయించుకోలేని ఆరోగ్య సమస్యలూ, కోట్లు నొక్కేసిన స్నేహితులూ, చుట్టూ జరుగుతున్న అక్రమాలూ, ఎవ్వడినీ ఏమీ చేయలేని అశక్తతా - ఇవన్నీ కలిసి తక్కువ వయసులోనే ఎక్కువ జీవితం చూసేసిన ఫీలింగ్ తీసుకొచ్చేవి & సాయంత్రానికే ఊరికే నీరసించిపోయేలా చేసేవి! ఈ మెటీరియల్ థింగ్స్ కి దూరంగా పారిపోవాలని ఉండేది, ఇది మరో కారణం! 4) జీవితంలో సంపాదించిన దాని కంటే ఎక్కువ అమౌంట్ కోల్పోయానన్న వాస్తవం & ఇంకెప్పటికీ అంత డబ్బు సంపాదించలేనేమోనన్న భయం వెంటాడి వేధించేవి! ప్రాణ స్నేహితుల చేతిలో మోసపోయి కోట్లు కోల్పోయిన నా చేతగానితనం నన్ను నిరంతరం వెక్కిరించేది. వీటి వల్ల మెల్లగా డబ్బు సంపాదించాలనే కోరిక పూర్తిగా సన్నగిల్లిపోయింది & ఉన్న దాంట్లో ఆనందంగా ప్రకృతికి దగ్గరగా ఉండాలనే కోరిక ఎక్కువైపోయింది! ఇది నాలుగో కారణం కావొచ్చు... ఎప్పటికైనా ఇండియా వెళ్లిపోతానని చెప్తుంటే జోక్ అనుకుని అప్పటివరకూ నా మాటలను కొట్టిపారేసిన మిత్రులు, ఫైనల్ డేట్స్ చెప్పాక షాక్ అయ్యారు & వద్దని వారించారు. కానీ ఎవ్వరి మాటా వినదల్చుకోలేదు, ఆఖరికి ప్రాణానికి ప్రాణమైన అన్నయ్య మాట కూడా! ఫైనల్ డెసిషన్ విని మావోడు నాతో కొన్నాళ్ళు మాట్లాడలేదు కూడా (ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు, మళ్ళా వెనక్కి పోయి అప్పుల పాలవుతాడనే భయం అనుకుంట) ఇంట్లో భార్యా పిల్లల్ని ప్రిపేర్ చేయడానికి కొంచెం టైమ్ పట్టింది. ఒకసారి కన్విన్స్ చేశాక, ఆఖరి ఏడాదిలో రేపనేది లేనట్టు దేశం మొత్తం ట్రిప్స్ మీద ట్రిప్స్ వేసేశా & వెనకా ముందూ ఆలోచించకుండా జాబ్ కి రిజైన్ చేసేశా! స్వదేశం వెళ్ళాక నికరంగా సంపాదన ఉంటుందో లేదో తెలియదు కాబట్టి, ఒక ఏభై లకారాల బ్యాంక్ బ్యాలెన్సుతోనే దేశం విడిచి పెట్టాం! Blog to be continued... (1/3)
6
10
85