![Lakkepogu. Vandana Kumar BSP🐘 Profile](https://pbs.twimg.com/profile_images/1812790265884692480/uFy4Uyui_x96.jpg)
Lakkepogu. Vandana Kumar BSP🐘
@VandhanBSP
Followers
1K
Following
160
Statuses
629
Addl. Director in Municipal Administration (Retd) | Official Spokesperson, Bahujan Samaj Party (BSP), Andhra Pradesh.
Vijayawada, AP; Hyderabad, TG
Joined June 2023
రెండు పుస్తకాలు-విభిన్న నేపథ్యాలు ఇద్దరు ఉద్ధండులే! ఒకరు సోషలిస్ట్ మూమెంట్ నుంచి, మరొకరు ద్రవిడ ఉద్యమం లోంచి. ఒకరు అభ్యుదయవాది, మరొకరు హేతువాది. ఒకరిది ఉత్తరం- మరొకరిది దక్షిణం జయప్రకాష్ నారాయణ్ అనుచరుడిగా ఒకరు, పెరియార్ రామస్వామి వారసుడు గ మరొకరు. ఒకరు బలిసిన కులాల కుట్రకు బలి అయితే, మరొకరు బలాన్ని పెంచుకొని రాష్ట్రాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇద్దరూ “మంగలి” కులస్థులే. “కర్పూరి ఠాకూర్-కరుణానిధి” ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేశారు. వీరిద్దరి గురించి తెలుసు కోవాలి. అందుకు ఈ రెండు పుస్తకాలు చ���వాలి. బి.సి.సమన్వయ కమిటీ లో వీటిని బహుకరించిన రచయిత “ అన్నవరపు బ్రహ్మయ్య” గారికి ధన్యవాదాలు.
0
7
30
ఒకటి విషాదం! మరొకటి సంస్కృతి!! అదిలాబాద్ జిల్లా, “ఇంద్రవెల్లిలో 1981 సంవత్సరంలో పోలీసులు గిరిజన (గోండులు) ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 60 మందికి పైగా గిరిజనులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు కారణం, గిరిజనులు తమ హక్కుల కోసం పోరాడుతూ, నక్సలైట్లకు సహకరిస్తున్నారని పోలీసులు అనుమానించడం. తెలంగాణ గిరిజన చరిత్రలో ఇదో విషాదకరమైన సంఘటన. ఆ మృతవీరులను స్మరించుకుంటూ నిర్మించిన స్మారకం వద్ద……. తెలంగాణ లోని “ఆదివాసీలు” ప్రకృతి ని పూజించే సంస్కృతి కి నిబద్ధులు. ఇంద్రవెల్లి కి దగ్గరలోనే “గోండు” తెగ లోని “మేశ్రం” వంశం వారు సాంప్రదాయ బద్ధంగా “నాగోబా జాతర” ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఆ సంప్రదాయాన్ని పరిశీలిస్తూ……. మూలవాసులైన ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలంటే చూడాల్సిందే.
0
2
25
*కొండను తవ్వి ఎలుకను పట్టారు* 55 ఏళ్ల క్రితమే “మాన్యవర్ కాన్షీరాం” గారు చెప్పడం జరిగింది. అగ్రకులాలను ఉద్��ేశించి”మేము 85శాతం, మీరు 15 శాతం” అని సూత్రీకరణ చేశారు. 1971, అక్టోబర్ 14 న “పూనె పట్టణంలోని కిర్కి (KADIKI) ఏరియా లో ఉన్న SVS School” లో జరిగిన Sc,St,Bc,Minorities Employees Association సమావేశంలో మొదటి సారి 85/15 % శాతం (బహుజనులు/అగ్రకులాల శాతం) ను బహిరంగంగా ప్రకటించాడు. (THAT IS MAANYAVAR ). ఇన్నాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ముక్కి, మూలిగి “నిజమే” నంటూ సర్వే ను బయటపెట్టారు. ఇక్కడ బహుజనులకు ఓ అభ్యంతరం ఉంది. ముస్లింలను కలుపుకుని అగ్రకులాలు 15.79 శాతం గ చెబుతున్నారు. వాళ్ళు ( Muslims) దాదాపు 9% శాతం పైగా ఉన్నారు. ఆ సంఖ్య ను మినహాయిస్తే అగ్రకులాలు ( రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, బనియ లు) కేవలం 7శాతానికి మించరు. సంపద, అధికారం మొత్తం ఈ 7శాతం మంది మాత్రమే అనుభవిస్తున్నారు.
0
5
44
*అధికారం* ఇవి రెండు విభిన్న కథనాలు. న్యాయం కోసం మనం చేసే పోరాటంలో "అధికారం" యొక్క పాత్ర ఎలా ఉంటుందనేది ఈ రెండు కథనాలను గమనించాలి. మన దేశంలో న్యాయం కోసం పాకులాడటం అంటే నేతి బీరకాయలో “నెయ్యి” కోసం వెతికినట్లే. అలాగే జీలకర్రలో “కర్ర”కోసం వెతికినట్లే. న్యాయం అనేది “అధికారానికి ఆత్మబంధువులాగా” మారిపోయింది. అయినా పోరాటం చచ్చేంత వరకు చేయవలసిందే! అదే సూత్రంతో “జకియ జాఫరీ” చనిపోయేంతవరకు గుల్బర్గా సొసైటీలో జరిగిన హత్యల గురించి పోరాటం చేసి అలిసిపోయి చనిపోయింది. ఇక ABV గురించి YCP ప్రభుత్వం లో అన్యాయానికి గురై, అవస్థల పాలైనాడు. TDP ప్రభుత్వం రాగానే అన్నీ మారిపోయినాయి. కొత్త జవసత్వాలు వచ్చాయి. ఈ రెండు సంఘటనల్లో “అధికారమే” ప్రధాన పాత్ర. ( ఒకరు ముస్లిం, మరొకరు కమ్మ ) ఈ మర్మాన్ని “అంబేద్కర్, కాన్షీరాం” లు 30 ఏళ్ల వయస్సులోనే అర్థం చేసుకున్నారు. మనకు జ్ఞానోదయం అవ్వాలంటే ఇంకెన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కావాలో!
1
4
14
*తిలాపాపం తలా పిడికెడు* 90 లకు ముందు కూడా దళితులకు, బీసీలకు, ఇతర మైనారిటీలకు చేసింది ఏమీ లేదు. మీ ముత్తాత నెహ్రూ "సోషలిజం" పేరు మీద 'బ్రాహ్మణులతో' పటిష్టమైన లాబీ తయారు చేశాడు. ఆ తర్వాత మీ నానమ్మ "ఇందిరమ్మ" ఆ లాబీ నీ చక్కగా పెంచి పోషించుకుంటూ, గర���బీ హటావో అని నినాదాలు చెప్పింది తప్ప, మాకు ఒరిగింది ఏమీ లేదు. చివరికి దళితులు అందరూ గరీబ్ ల్లా గానే ఉన్నారు. మీ అయ్య “రాజీవ్ గాంధి “ మాకు వ్యతిరేకంగా పార్లమెంట్ లోనే 200 ప్రశ్నలు సంధించారు. మర్చిపోలేము. ఇక “బిజెపి” ( బ్రాహ్మణ, బనియా జాతి పార్టీ) వాళ్లు డైరెక్టుగా దెబ్బ కొడుతున్నారు. మీరు దెబ్బ తెలియకుండా కొట్టారు, అంతే తేడా. మా వాళ్ళ బతుకులు మాత్రం యధాతధం గానే ఉన్నాయి. అన్నిటికీ మించిన సిగ్గుచేటు ఏంటంటే ఇప్పటికి కూడా చేస్తాము, చూస్తాము అని చెప్పిందే చెప్పి, గుంజ కట్టిన జంతువు ల్లాగా మమ్మల్ని తయారు చేయడంలో మీ రెండు పార్టీలు ఒకరికి మించినోళ్ళు మరొకళ్ళు. కొసమెరుపు ఏమిటంటే 90 ల తర్వాత "మాన్యవర్ కాన్షి రాం" " బీఎస్పీ", ద్వారా, మీరు తాయారు చేసిన మనువాద భావజాలాన్ని దళితులు, బి. సీ లకు అర్థమయ్యేట్టు చెప్పగలిగాడు. దాంతో మీ కోట కూలిపోయింది. అంతర్లిీ నంగా మీలో ఉన్న "దుగ్థ" మాకు అర్థమైంది రాహుల్ గారు.
0
4
13
*ప్రధాని మోడీ కాళ్లు కడిగారు. కన్నీళ్లు మాత్రం తుడవలేదు* ప్యారేలాల్ అనే వర్కరు "నా కాళ్ళు అయితే కడిగారు, కానీ నా బాధలు ఎవరు తీర్చలేదు. అప్పటికి ఇప్పటికీ నా జీవితంలో ఏమీ మార్పు లేదు" అని శానిటేషన్ వర్కర్ గా చేస్తున్నటువంటి వ్యక్తి వాపోయాడు. ఔట్సోర్సు చేయడానికి ముందు వర్కర్లు పర్మినెంట్ గా పని చేస్తూ మంచి జీతాలు తీసుకునే వాళ్ళు. వాళ్ళకి బట్టలు, సబ్బులు, కొబ్బరి నూనె, పాదరక్షలు ఇచ్చే వారు. అందరి ఉద్యోగులు లాగా ఇంక్రిమెంట్లు, పిఆర్సిలు, డిఏలు, గ్రాట్యుటీ, లీవ్ శాలరీ, ఇతర అన్ని సౌకర్యాలు ఉండేవి. ఇంకా బదిలీ వర్కర్లు ఉండేవాళ్లు. అలాగే వార��త్వపు ఉద్యోగాలు ఉండేవి. హక్కుల పరిష్కారం కోసం ట్రేడ్ యూనియన్లు కూడా ఉండేవి. ఇప్పుడు ఇవి ఏమీ లేవు. కాళ్లు కడిగితే ఏమొస్తుంది సార్, కన్నీళ్లు తుడవాలి కాని. కలిసి భోజనం చేసినంత మాత్రాన వాళ్ళ కడుపులు నిండుతాయా? ఇలాంటి టక్కు టమారా విద్యలు గతంలో “ఇందిరా గాంధీ” కూడా చేసేది. అబ్బే ఏమి మార్పు లేదు. మారకపోగా పరిస్థితులు మరింత దిగజారినాయి. ( THE HINDU Daily report on 25-01-2025) from Ground Zero.
1
6
30
*మూర్తీభవించిన మతమౌఢ్యం* ప్రజల బలహీనత, ప్రభుత్వాల ఓట్ల వేట, సంస్కృతి పేరుతో సంస్థల మతోన్మాద ప్రచారం, పబ్బం గడుపుకోవడం కోసం ప్రత్యేక దినాల పేరుతో పూజారులు, కార్పొరేట్ల కక్కుర్తి విన్యాసాలు, “చిల్లర” కోసం చిరు జీవుల వ్యాపారాలు, “రేటింగ్స్” రేస్ లో మీడియా హోరు, వెరసి చనిపోయిన అమాయక ప్రజలు, ఆపైన బతికి ఉన్న వారి హాహాకారాలు. మతోన్మాదంతో “మంటలు రేపుతున్న” ప్రభుత్వాల్లో మానవత్వం కరువైంది. సానుభూతి తో సమస్య తీరేది కాదు!
0
4
28