![TGSWREI SOCIETY Profile](https://pbs.twimg.com/profile_images/708384809672777729/aClOQhWh_x96.jpg)
TGSWREI SOCIETY
@TGSWREIS
Followers
16K
Following
276
Statuses
543
Official account for #TGSWREIS,Focused on enhancing academic excellence, promoting skill development,and fostering holistic growth of students.
Telangana
Joined March 2016
కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థుల కు నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ---మునగాల (నెమలి పురి ) TGSWRS/JC (B) MUNAGALA పాఠశాల కు చెందిన 3 విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. వి.స్టాలిన్ 2వ స్థానం ను సాధించి మెరిట్ సర్టిఫికెట్ తో పాటు 3,016 రూపాయలు నగదు బహుమతి అందుకోవడం జరిగింది. యశస్వి మరియు లష్మినారాయణ షిల్డ్, మెరిట్ సర్టిఫికెట్ ను అందుకోవడం జరిగింది. బహుమతి ప్రధాన కార్యక్రమం లో రాజకీయ నాయకులు, కోదాడ M. E. O సలీం సార్, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల కు ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీరామ్ మరియు ఉపాధ్యాయు లు అభినందనలు తెలిపారు.
1
1
3
"ఒక బాధ్యతారహిత మరియు ఆధారరహిత వ్యాఖ్య!” గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపై (Twitter) ‘X’ లో ఒక మాజీ IPS అధికారి చేసినటువంటి అమర్యాదకరమైన మరియు సున్నితత్వం లేని వ్యాఖ్యలను చూస్తే తీవ్ర నిరాశ కలుగుతోంది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మోసపూరితమైనవి మాత్రమే కాదు, వాస్తవ విరుద్ధంగా, బాధ్యతారహితంగా ఉన్నాయి. అంతేకాక ఆ అధికారి తమ పదవి కున్న గౌరవాన్ని ఆయనే పూర్తిగా కించపరుస్తుస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. TGSWREIS సంస్థలో చాలా సంవత్సరాలు కీలక పదవిని నిర్వహించిన ఆ అధికారి, ప్రజలకి తిరిగి ఇచ్చేది ఇదేనా? ఒక గురుకులంలో సంభవించిన సంఘటన గురించి వాస్తవాలను సరిచూసుకుని వ్యాఖ్యానించకుండా, సిగ్గు లేకుండా ప్రభుత్వంపై నిందను మళ్లిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు అతని అధికారపర్యవేక్షణలో ఈ గురుకులల్లో జరిగినప్పుడు అతని శ్రద్ధ ఎక్కడ ఉంది? ఏమైంది ? "మా పిల్లలు" అని ఆయన చేసిన ప్రస్తావన కూడా అభ్యంతరకరమైనది. కొందరు విద్యార్థులు మాత్రమే "మా పిల్లలు" అయితే, మిగతావారు కాదా? వివిధ నేపధ్యాల నుండి వచ్చిన విద్యార్థులు తెలంగాణ యొక్క భాగం కాదా? ఇటువంటి విభజనాత్మక భాష మన రాష్ట్రం యొక్క చిన్న పిల్లల పట్ల ఆయన సంకుచిత ఆలోచనని మరియు పూర్తి అగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. అతని దృష్టి నిజంగా విద్య మరియు సంస్కరణలపై ఉంటే, గత ఆరు నెలల్లో ఆయన నుండి కనీసం ఒక నిర్మాణాత్మక సూచన మనకు అందివుండేది . బదులుగా, తర్కం లేదా కారణం లేకుండా ప్రతి అవకాశంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే ఆయన ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది ఆధారాలు లేని వాక్చాతుర్యంతో కూడిన రాజకీయ అవకాశవాదం తప్ప మరొకటి కాదు. సమగ్రమైన విద్య, చక్కటి క్రమశిక్షణ మరియు విద్యార్థుల సంక్షేమనికే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యతనిచ్చింది. ఎల్లప్పుడూ ఇస్తుంది. ఆహార ప్రణాళికలో మెరుగుదలలు, మెస్ మరియు కాస్మాటిక్ ఛార్జీలను పెంచడం, సౌకర్యాలను సకాలంలో సరఫరా చేయడం, విద్యాసంస్థలకు విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయడం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల స్థాపన, పాఠశాలల్లో AI & ML శిక్షణని ప్రవేశపెట్టడం, అన్ని విద్యా సంస్థల్లో టీచింగ్ మరియు సహాయ స్టాఫ్ నియామకాలు, నిర్దేశిత సమయాల్లో ఫిర్యాదులు పరిష్కరించడం వంటి అనేక ప్రయోజన కార్యక్రమాలు కేవలం ఒక సంవత్సరంలో ఈ గురుకులల్లో సాధించబడ్డాయి. వ్యవస్థను బలోపేతం చేయడానికి మరిన్ని నిర్మాణాత్మక విధానాలు ప్రణాళికలో ఉన్నాయి. మన రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి పిల్లల కోసం బలమైన వ్యవస్థ మరియు మరింత బలమైన విద్యా సంస్థను ఏర్పాటు చేయడంపై గౌరవ ముఖ్యమంత్రి గారు అంకితభావంతో ఆవిశ్రాంతంగా పని చేస్తున్నారు. ఈ సంధర్భంగా నిజమైన ప్రశ్న మనమందరము ఆడగవలసింది ఏమిటంటే — ఒకే అధికార స్థానంలో ఒక దశాబ్దం పాటు పనిచేసిన ఈ అధికారి, బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో ఎందుకు సానుకూలంగా కృషి చేయలేకపోయారు ? అ ప్రయత్నములో ఎందుకు ఘోరంగా విఫలమయ్యారు? తమ రాజకీయ లాభాల కోసం కళ్ళెదుట కనిపిస్తున్న వాస్తవ పరిస్థితిని మరుగుపరిచి, అందమైన చిత్రాన్ని చూపించానని ఆయన ఒప్పుకుంటున్నారా ? @TelanganaCMO @ తెలంగాణ ప్రజలు ఇటువంటి బూటకపు ప్రకటనలతో ప్రభావితం కారు.
6
1
6
గురుకుల ప్రవేశం కోసం గడువు ఫిబ్రవరి 6 వరకు పెంపు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వివిధ గురుకుల లో ప్రవేశం కోసం దరఖాస్తులు స��వీకరించేందుకు గాను ఈనెల అనగా ఫిబ్రవరి 6 వరకు పెంచినట్టు TGSWREIS కార్యదర్శి Dr. వి.ఏస్ అలగు వర్షిణి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకులాల్లో ఐదవ తరగతి నుండి 9 వ తరగతి వరకు..రాష్ట్రంలో��ి ఎస్సీ, ఎస్టీ,బీసీ, జనరల్ గురుకులాలలో ప్రవేశం కోసం 1 ఫిబ్రవరి 2025 చివరి తేదీగా వుండగా ఇప్పుడు మరో ఐదు రోజులపాటు గడువును పెంచారు. వరుస సెలవులు రావడం అలాగే దరఖాస్తులు అధిక సంఖ్యలో రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
1
10
25