![G M Harish Balayogi Profile](https://pbs.twimg.com/profile_images/1833399290607054848/WPAN2IFD_x96.jpg)
G M Harish Balayogi
@HarishBalayogi
Followers
11K
Following
96
Statuses
3K
Son of GMC Balayogi | TDP Parliamentary Whip | Member of Parliament - 18th Loksabha, Amalapuram | Parliament Incharge @JaiTDP | Proud Citizen of Konaseema | 🚲
Amalapuram, India
Joined March 2019
శాప్ చైర్మన్ రవినాయుడు, శ్రీకాళహస్తి ఏమైల్యే @BojjalaSudhir గార్లతో కలిసి ఏపీ స్పోర్ట్స్ పార్లమెంటరీ ఇంచార్జ్ గా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి శ్రీ @mansukhmandviya గారిని కలిసాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సహాయ, సహకారాలు అందించాలని గతంలో అందుకు సంబంధించిన వివరాలతో అందించిన లేఖకు సంబంధించిన ప్రగతి వివరాలను అడిగి తెలుసుకున్నాము. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి విజన్ కు అనుగుణంగా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎకలెన్స్, జిల్లా స్థాయిలో మరిన్ని ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేయాలని, వివిధ క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, రాష్ట్రంలో యువతకు అన్నివిధాలా సహకరించే విధంగా అన్ని జిల్లా కేంద్రాలలో యూత్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని కోరాము. మా విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
0
1
4
డా. ��ీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో సహా, రాష్ట్రంలో వివిధ విద్య, నైపుణ్యాభివృద్ది కేంద్రాల ఏర్పాటుపై చర్చించేందుకు, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ది శాఖ సహాయ మంత్రి(ఇండిపెండెంట్ ఛార్జ్) శ్రీ @jayantrld గారిని కలిశాను. కొత్తగా ఏర్పాటైన కోనసీమ జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వారిని కోరాను.అదే సమయంలో తక్షణమే జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేయాలని వినతిపత్రం అందించాను. ఐటీఐ కాలేజీల ఆధునికీకరణ త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులు పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యాలను పెంచుకునేలా తయారు చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించాను. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ది, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించాల్సిన అంశాన్ని ప్రస్తావించాను. నా వినతులు, విజ్ఞప్తులు సావధానంగా విన్న మంత్రి అన్ని విషయాలకు సానుకూలంగా స్పందించారు.
1
0
6
రాష్ట్ర విద్య, ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @naralokesh గారి ఢిల్లీ పర్యటలో భాగంగా ఆయనతో కలిసి కేంద్ర విద్యాశాఖ మంత్రి @dpradhanbjp గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నాము. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనం (All India Education Ministers' Conclave) ను ఎపిలో ఏర్పాటుచేసే అవకాశం కల్పించాల్సిందిగా మంత్రి లోకేష్ గారు కోరారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. విద్యారంగంలో కీలక సంస్కరణలపై చర్చించడానికి ఈ కాన్క్లేవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. గత ప్రభుత్వ అసమర్థత, ఆర్థిక దుర్వినియోగం, కేటాయించిన వనరులను తక్కువగా ఉపయోగించడం వల్ల ఎపిలో విద్యావ్యవస్థ కుంటుపడింది. దీనివల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా కీలక రంగాల్లో పెద్దఎత్తున బకాయిలు ఉన్న విషయాన్ని ఆయనకు తెలియజేసారు. కెజిబివిలు, నైపుణ్య విద్య, ICT ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి ఎపికి మరిన్ని నిధుల కేటాయించాలని విజ్ఞప్తి చేసారు.
1
9
79
డిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి శ్రీ @naralokesh గారి ఆధ్వర్యంలో సహచర కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి కేంద్ర రక్షణశాఖ మంత్రి @rajnathsingh గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నాము. మంత్రి లోకేష్ గారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఎపికి వచ్చేలా సహకరించాలన్నారు. దీనికి రాజనాధ్ సింగ్ గారు సానుకూలంగా స్పందించారు.
1
6
44
రాష్ట్ర విద్య, ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ @naralokesh గారి ఆధ్వర్యంలో సహచర ఎంపీలు, మంత్రులతో కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారిని కలిసాము. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఏపీకి కేటాయించాలని నారా లోకేష్ గారు కోరారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న తపన, చిత్తశుద్ధికి నిదర్శనంగా ఈ సమావేశం నిలిచింది.
1
7
77
రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర మంత్రి @AshwiniVaishnaw గారిని కలిసి సహాయ సహకారాలు అందించాలని కోరేందుకు ఢిల్లీ విచ్చేసిన మాన్య మంత్రి వర్యులు @naralokesh గారికి స్వాగతం పలకడం సంతోషంగా ఉంది.
0
8
70
2025-26 రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేటాయింపులు జరిగాయి. రైల్వే శాఖ మంత్రి శ్రీ అ��్వనీ వైష్ణవ్ గారు బడ్జెట్ లో రాష్ట్ర వ్యాప్తంగా నూతన రైల్వే లైన్ల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు, ఆధునికీకరణ పనులకు రూ.84,559 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయడం, వాటి అమలుకు రూ. 9,417 కోట్ల నిధులు కేటాయించడం ముదావహం. రైల్వే మంత్రి @AshwiniVaishnaw గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి శ్రీ @narendramodi , ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ncbn గారి దార్శనిక నాయకత్వంలో, NDA ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉన్నత శిఖరాలకు చేరుతుంది అనడానికి ఈ కేటాయింపులు నిదర్శనం.
0
3
9
ఫెబ్రవరి 5 తేదీన జరిగే డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే తరపున ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారీతిలో కలిసి పాల్గొన్నాను. ముఖ్యమంత్రి గారు షాద్రా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ సంజయ్ గోయల్ గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొని, గత పదేళ్లుగా ఆప్ పాలనలో ఢిల్లీలో జరిగిన విధ్వంసం గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఏపి బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రెడ్డి, ఢిల్లీ బీజేపీ అధ్యక్షులు వీరేందర్ సచ్ దేవ కూడా పాల్గొన్నారు.
0
5
23
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే తరపున ప్రచారంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ncbn గారికి సహచర ఎంపీలు, మంత్రులతో కలిసి స్వాగతం పలికాము. వారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నాను.
1
39
484
త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో షాలిమర్ భాగ్ నియోజకవర్గం, బీజేపీ అభ్యర్థి శ్రీమతి రేఖా గుప్తా గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నాను. ప్రచారంలో రాజ్యసభ సభ్యులు శ్రీ నరేష్ భన్సాలీ గారు మరియు మాజీ ఎంఎల్సీ @MadhavBJP గారు కూడా పాల్గొన్నారు.
0
6
32
ప్రజలకు మేలు చేకూర్చే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి శుభాకాంక్షలు. వికసిత్ భారత్ విజన్‌ను ప్రతిబింభించేలా బడ్జెట్ ఉంది. మహిళలు, పేదలు, యువత, వ్యవసాయదారుల సంక్షేమానికి బడ్జెట్ పెద్దపీట వేసింది. రానున్న ఐదేళ్లలో కీలక రంగాల్లో అభివృద్ధికి ఈ బడ్జెట్ మార్గదర్శకత్వం చేస్తోంది. దేశ సౌభాగ్యానికి, భవిష్యత్‌కు కార్యాచరణ ప్రణాళిక ఈ బడ్జెట్. మధ్యతరగతి వర్గానికి ట్యాక్స్ రిలీఫ్, ఈ బడ్జెట్‌లో వచ్చిన అదనపు ప్రయోజనం. ఈ బడ్జెట్‌ను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను.
0
3
9
అహింస, సత్యం ఆయుధాలుగా దేశాన్ని దాస్యశృంఖలాల నుంచి విముక్తి కల్పించి, స్వాతంత్య్రం అందించిన జాతిపిత మోహన్ దాస్ కరం చంద్ గాంధీ, ఆ మహాత్ముని వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను. అహింస అనే ఆయుధంతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భరతమాతకు స్వేచ్ఛను అందించిన మహోన్నతుడు మహాత్మాగాంధీ.. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపిన మహనీయులు. భారతదేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషిచేయడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి.
0
3
18
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ncbn గారి అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సహచర ఎంపీలతో కలిసి పాల్గొన్నాను. ఈ నెల 31 వ తేదీ నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాము. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రాబోయే బడ్జెట్ లో కేంద్రం నుంచి మరిన్ని కేటాయింపుల సాధనకు మరింత సమన్వయంతో కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.
2
17
111